ప్రజా పాలనకు 1000 రోజులు.. ఇదే మా లెక్క: మూడ్ మోహన్ నాయక్

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ పాలనకు ముగింపు ఉద్యోగాలు, రైతు రుణమాఫీతో ప్రజలకు భరోసా సంక్షేమ పథకాలతో మార్పు స్పష్టమైందని వెల్లడి తుంగతుర్తి: తెలంగాణలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో 1000 రోజులు పూర్తయ్యాయని తుంగతుర్తి నియోజకవర్గ టీపీసీసీ సోషల్ మీడియా ప్రతినిధి మూడ్ మోహన్ నాయక్ అన్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కే పరిమితమైన పాలనకు భిన్నంగా ప్రజలకు అందుబాటులో ఉండే పాలనను కాంగ్రెస్‌ ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు. ప్రగతి భవన్‌ కంచె తొలగించి ప్రజా భవన్‌గా మార్చడం, అసెంబ్లీలో ప్రజా సమస్యలను చర్చించడం, గ్రూప్‌-1, డీఎస్సీ ఉద్యోగ నియామకాలు చేపట్టడం వంటి చర్యలను ఆయన ప్రస్తావించారు. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయడంతో పాటు మహిళలకు...