ఏపీ మహిళలకు చంద్రబాబు కీలక ప్రకటన.. ఏసీ బస్సుల్లోనూ ఫ్రీ జర్నీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో కీలక హామీ ఇచ్చారు. రాష్ట్రంలో త్వరలో అందుబాటులోకి రానున్న ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొగల్తూరులో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం ఈ విషయాన్ని వెల్లడించారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇప్పటివరకు పింఛన్ల రూపంలో రూ.73 వేల కోట్లు అందించామని చంద్రబాబు తెలిపారు. మహిళల కోసం దీపం పథకాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేశారు. మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ...