బరువు తగ్గాలంటే బెల్లం మంచిదేనా?
చక్కెరకు బదులుగా బెల్లం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చాలామంది భావిస్తుంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవారికి బెల్లం ప్రత్యేకంగా ఉపయోగపడుతుందా అంటే.. నిపుణుల ప్రకారం అలా చెప్పడానికి సరైన ఆధారాలు లేవు. బెల్లంలో ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి కొన్ని ఖనిజాలు చక్కెరతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి. అయితే క్యాలరీల విషయంలో మాత్రం రెండింటి మధ్య పెద్దగా తేడా లేదు. 100 గ్రాముల బెల్లంలో సుమారు 383 కిలోక్యాలరీలు ఉండగా.. అదే పరిమాణంలో చక్కెరలో దాదాపు 387 కిలోక్యాలరీలు ఉంటాయి. అంతేకాదు, బెల్లంలోనూ సుక్రోజ్ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు రోజువారీ ఆహారంలో కొన్ని చిన్న...