కవితకు ప్రశాంత్ రెడ్డి కౌంటర్

కేసీఆర్ వెంట ఉన్నది ఎవరో కవిత తెలుసుకోవాలన్న ప్రశాంత్ రెడ్డి తండ్రి-కూతురిని కలపడానికే ప్రయత్నించానని వెల్లడి కవిత పార్టీ లైన్ దాటడం వల్లే చర్యలు తీసుకున్నారని వ్యాఖ్య కవిత తనపై చేసిన ఆరోపణలను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కష్టకాలంలో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వెంట నిలిచింది ఎవరో కవిత తెలుసుకోవాలని అన్నారు. తన చర్యల వల్ల కేసీఆర్ మనోవేదనకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడూ కేసీఆర్‌, కవితను కలిపేందుకు ప్రయత్నించానే తప్ప.. వారిద్దరినీ విడదీయడానికి కాదని స్పష్టం చేశారు. తాను, తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి పార్టీ ఆవిర్భావానికి ముందే కేసీఆర్‌తో కలిసి పనిచేశామని గుర్తుచేశారు....