కేసీఆర్ పేరు వింటే రేవంత్ వణుకుతారు: జగదీశ్ రెడ్డి
ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు నీటి సమస్యను పట్టించుకోవడం లేదని ఆరోపణ రేపటి నుంచి బీఆర్ఎస్ పోరుబాట బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరు వింటేనే సీఎం రేవంత్ రెడ్డి భయపడుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఆ భయంతోనే కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సూర్యాపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజా సమస్యలను పక్కనబెట్టి అవినీతి సొమ్ము లెక్కల్లో ప్రభుత్వ పెద్దలు నిమగ్నమయ్యారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్కు నదీ జలాలు తరలిపోతున్నా అడ్డుకోలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సీఎం రేవంత్ అన్యాయం చేయడం వల్ల...