‘రోమాంచకం’పై పెరుగుతున్న అంచనాలు

సుమంత్ ప్రభాస్‌, అనంతిక జంటగా నటన సెన్సార్ పూర్తి.. U/A సర్టిఫికెట్ సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల సందీప్ రెడ్డి వంగా సమర్పణలో తెరకెక్కిన ‘రోమాంచకం’ సినిమా విడుదలకు సిద్ధమైంది. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి వేణు గోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. ‘మేము ఫేమస్’, ‘గోదారి గట్టుపైన’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్‌ హీరోగా నటించగా.. అనంతిక సనిల్‌కుమార్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. యువతను ఆకట్టుకునేలా లవ్‌, కామెడీ అంశాలతో సినిమాను రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇటీవల నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు విజయ్ దేవరకొండ...