హైదరాబాద్ ప్రమాదం.. ఆనంద్ సాయి కుమారుడి అరెస్ట్

రోడ్డు ప్రమాదంలో నందులాల్ మృతి సీసీటీవీ ఆధారంగా రెండు కార్ల గుర్తింపు రెండో కారు డ్రైవర్ కోసం పోలీసుల గాలింపు హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ప్రమాదంలో బీహార్‌కు చెందిన నందులాల్ అనే వ్యక్తి మృతి చెందాడు. ఓఆర్‌ఆర్ రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే రహదారిపై నందులాల్ రోడ్డు దాటుతుండగా సందీప్ కారు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన నందులాల్‌ను జైద్ షా ఖాద్రీ అనే విద్యార్థి ఆసుపత్రికి తరలించేందుకు తన కారులో తీసుకెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చిన...