5 నిమిషాల ఆలోచన.. రూ.5 లక్షల కోట్ల సామ్రాజ్యం
చిన్న ఆలోచనతో తొలి విజయం అలీబాబాలో పెట్టుబడితో భారీ లాభం ఇప్పుడు ఏఐ రంగంపై భారీ ఫోకస్ కాలేజీ రోజుల్లో రోజుకు కేవలం ఐదు నిమిషాలు ఆలోచించి నెలకు 10 వేల డాలర్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్న మసయోషి సన్.. ఆ ఆలోచనను నిజం చేసి ప్రపంచ టెక్ రంగంలో ప్రముఖ పెట్టుబడిదారుగా ఎదిగారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ, బెర్క్లీలో చదువుతున్న సమయంలో ఎలక్ట్రానిక్ ట్రాన్స్లేటర్ తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. పరిశోధకుల సహకారంతో దాన్ని అభివృద్ధి చేసి షార్ప్ సంస్థకు 1.7 మిలియన్ డాలర్లకు విక్రయించారు. మరో వ్యాపారంతో కలిపి 18 నెలల్లో సుమారు 3.2 మిలియన్ డాలర్లు సంపాదించారు. 1981లో సాఫ్ట్బ్యాంక్ను స్థాపించిన సన్.....