కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్పై ఊరట
స్టే ఎత్తివేసిన హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు పథకాల అమలుకు తొలగిన అడ్డంకులు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. పథకాల అమలుపై సింగిల్ జడ్జి విధించిన మధ్యంతర స్టేను ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మంగళవారం రద్దు చేసింది. 2014 నుంచి ప్రభుత్వం జారీ చేసిన ఎనిమిది జీవోలను సవాలు చేస్తూ న్యాయవాది విజయ్ గోపాల్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సింగిల్ జడ్జి పథకాల అమలుపై స్టే విధించారు. దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలు...