విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు: తలసాని

ఫీజు బకాయిలపై విమర్శలు రూ.11 వేల కోట్ల బకాయిలున్నాయని ఆరోపణ విద్యార్థుల పోరాటానికి అండగా ఉంటామన్న బీఆర్‌ఎస్‌ తెలంగాణలో విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు తనను కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం తీసుకొచ్చారని తలసాని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం రూ.11 వేల కోట్ల బకాయిలను పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు. నిధులు విడుదల కాకపోవడంతో కొన్ని కళాశాలలు కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని,...