కూటమికి తిరుగులేదు: చంద్రబాబు

ఎన్నికలకు భయపడుతున్నారంటూ విమర్శ స్థానిక ఎన్నికలకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపణ సంక్షేమం, అభివృద్ధిపై చంద్రబాబు వివరణ ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమికి తిరుగులేదని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఓటమి భయంతోనే ప్రతిపక్ష పార్టీ కోర్టులను ఆశ్రయిస్తూ స్థానిక ఎన్నికలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. స్థానిక సంస్థలు ఉంటేనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందని, కేంద్రం నుంచి నిధులు రావాలన్నా స్థానిక ప్రభుత్వాలు అవసరమని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ ప్రతిపక్షం అడ్డంకులు సృష్టిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించవద్దంటూ...