ఆఫ్ఘాన్‌ సిరీస్‌కు టీమిండియా ప్రకటన

శ్రేయాస్‌కు కెప్టెన్సీ హార్దిక్‌కు చోటు దక్కలేదు వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్‌కు కెప్టెన్సీ అప్పగించగా.. హైదరాబాద్‌ క్రికెటర్‌ తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు జట్టులో చోటు దక్కలేదని సమాచారం. 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీకి తొలిసారి అవకాశం లభించింది. గత సిరీస్‌ల్లో పెద్దగా ఆకట్టుకోని సంజు శాంసన్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. ఇషాన్ కిషన్ కూడా జట్టులో ఉన్నాడు. శివమ్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ తదితరులు జట్టులో...