దులీప్‌ ట్రోఫీలో షమీ జోరు

షమీకి 2 వికెట్లు ముకేశ్‌కు 4 వికెట్లు సెంట్రల్‌ జోన్‌ 158కే ఆలౌట్‌ దులీప్‌ ట్రోఫీలో మహమ్మద్‌ షమీ తన పేస్‌ బౌలింగ్‌తో సత్తా చాటుతున్నాడు. బెంగళూరులో జరుగుతున్న సెమీఫైనల్‌లో ఈస్ట్‌ జోన్‌ తరఫున బరిలోకి దిగిన షమీ.. సెంట్రల్‌ జోన్‌ను దెబ్బతీశాడు. సెంట్రల్‌ జోన్‌ రెండో ఇన్నింగ్స్‌లో షమీ రెండు కీలక వికెట్లు పడగొట్టగా.. మరో పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ నాలుగు వికెట్లతో చెలరేగాడు. దీంతో సెంట్రల్‌ జోన్‌ 158 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు 266 పరుగులు చేశాయి. ఈస్ట్‌ జోన్‌ తరఫున వైభవ్‌ సూర్యవంశీ 92 పరుగులతో రాణించగా.. అభిమన్యు ఈశ్వరన్‌ 69 పరుగులు చేశాడు. వీరిద్దరూ కలిసి...