హైదరాబాద్‌లో గ్లోబల్‌ యూనివర్సిటీలు

లండన్, నార్త్‌ఈస్టర్న్‌ వర్సిటీల క్యాంపస్‌లు భారత్‌లో తొలిసారి హైదరాబాద్‌లో ఏర్పాటు హార్వర్డ్‌ కోర్సులపై ఆసక్తి హైదరాబాద్‌ను గ్లోబల్‌ నాలెడ్జ్‌ హబ్‌గా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. బ్రిటన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌, అమెరికాలోని నార్త్‌ఈస్టర్న్‌ యూనివర్సిటీ తమ ఆఫ్‌షోర్‌ క్యాంపస్‌లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. భారత్‌లో ఈ రెండు అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు క్యాంపస్‌లు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. సీఎం రేవంత్‌ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధుల విదేశీ పర్యటనల్లో జరిగిన చర్చల ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్‌ యూనివర్సిటీ...