వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలించిన పోలీస్ కమిషనర్
ఖమ్మం ప్రతినిధి: సెప్టెంబర్, 1: ఖమ్మం నగరంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేక దృష్టి సారించారు. మున్నేరు నదిలో ప్రస్తుతం నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యామ్నాయంగా అనువైన చెరువులను మంగళవారం పరిశీలించారు. పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ అధికారులు, సంభాద్రి ఉత్సవ కమిటీ తో కలిసి నిమజ్జనానికి అనువైన చెరువులను సందర్శించి, అక్కడి పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అందులో భాగంగా ఖమ్మం అర్బన్ మండలంలోని దంసలాపురం గ్రామపంచాయతీ లోని కొత్తూరు చెరువు సందర్శించి పరిశీలించారు. గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన భద్రతా,...