కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మంత్రి తుమ్మల భేటీ..

•కొత్తగూడెం విమానాశ్రయ కలకు రెక్కలు •సెప్టెంబరు 7న క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర సాంకేతిక బృందం •నాలుగైదు ప్రత్యామ్నాయ స్థలాలపై లోతైన అధ్యయనం •నివేదిక అనుకూలిస్తే తక్షణణమే తదుపరి చర్యలు •కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఖమ్మం ప్రతినిధి: సెప్టెంబర్: 1, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల దశాబ్దాల కల సాకారం దిశగా మరో కీలక ముందడుగు పడింది. జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని గుర్తించే ప్రక్రియలో భాగంగా సెప్టెంబరు 7న కేంద్ర సాంకేతిక బృందం తెలంగాణలో పర్యటించనుంది. నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రన్‌వే నిర్మాణానికి అనుకూలత, భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, భూసేకరణ తదితర అంశాలపై సమగ్రంగా...