ఏపీలో ‘ఎస్ఐఆర్’ గడువు పెంపు
ఈ నెల 10 వరకు గడువు అక్టోబర్ 5 వరకు అభ్యంతరాల స్వీకరణ 9న తుది ఓటర్ల జాబితా అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ ప్రక్రియకు ఈ నెల 10 వరకు అవకాశం కల్పించింది. క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబర్ 5 వరకు గడువు ఇచ్చింది. అనంతరం అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.