హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనంపై వివాదం

నిమజ్జనంపై హైదరాబాద్‌లో కొత్త వివాదం పునరుద్ధరించిన చెరువులపై హైడ్రా అభ్యంతరం హైడ్రా నిర్ణయాన్ని వ్యతిరేకించిన గణేశ్‌ ఉత్సవ సమితి సంప్రదాయం ప్రకారం నిమజ్జనం కొనసాగిస్తామని వెల్లడి చెరువుల కాలుష్యంపై భిన్న వాదనలు హైదరాబాద్‌: వినాయక చవితి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ గణేశ్‌ విగ్రహాల నిమజ్జనంపై హైదరాబాద్‌లో వివాదం తలెత్తింది. చెరువుల పరిరక్షణలో భాగంగా పునరుద్ధరించిన కొన్ని చెరువుల్లో విగ్రహాల నిమజ్జనాన్ని అనుమతించబోమని హైడ్రా స్పష్టం చేసింది. దీంతో భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నిమజ్జనాన్ని నిలిపివేసే అధికారం హైడ్రాకు లేదని సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం ఈ ఏడాది కూడా నగరంలోని చెరువుల్లో నిమజ్జన...