ఉక్రెయిన్లో రష్యా క్షిపణి దాడి.. తెలంగాణ వ్యక్తి మృతి
జగిత్యాల: ఉక్రెయిన్పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో తెలంగాణకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. జగిత్యాల జిల్లా హస్నాబాద్ గ్రామానికి చెందిన వావిలాల సుదర్శన్ గౌడ్ (42) ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఉపాధి కోసం సుదర్శన్ గౌడ్ నాలుగు నెలల క్రితం ఉక్రెయిన్ వెళ్లాడు. స్వగ్రామంలో షట్టరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించిన ఆయన.. ఉక్రెయిన్లోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం రష్యా సైన్యం కీవ్తో పాటు పలు నగరాలపై క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లతో భారీ దాడులు చేసింది. ఈ సమయంలో సుదర్శన్ తన నివాస గది నుంచి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జరిగిన...