సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు అరుదైన ఘనత

దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న స్టేషన్లలో 4వ స్థానం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,276.29 కోట్ల ఆదాయం ఏడాదిలో 2.78 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలు రూ.714 కోట్లతో కొనసాగుతున్న ఆధునికీకరణ పనులు హైదరాబాద్: దేశంలో ప్రయాణికుల ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న రైల్వే స్టేషన్లలో సికింద్రాబాద్ జంక్షన్ నాలుగో స్థానాన్ని సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల ఆదాయం రూపంలో రూ.1,276.29 కోట్లు సమకూరాయి. సుమారు 2.78 కోట్ల మంది ప్రయాణికులు స్టేషన్‌ ద్వారా రాకపోకలు సాగించారు. ఆదాయంలో రూ.3,337 కోట్లతో న్యూఢిల్లీ మొదటి స్థానంలో ఉండగా, రూ.1,692 కోట్లతో హౌరా, రూ.1,299 కోట్లతో ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటి...