పవన్ బర్త్డే వేడుకల్లో విషాదం.. జనసైనికుడు మృతి
ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ అమలాపురం: పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లలో విషాదం చోటుచేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడిని బెండమూర్లంకకు చెందిన రోళ్ల ప్రేమ్ కుమార్ (22)గా గుర్తించారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలను స్నేహితులతో కలిసి నిర్వహించేందుకు ప్రేమ్ కుమార్ స్వగ్రామానికి వచ్చినట్లు సమాచారం. ఫ్లెక్సీ ఏర్పాటు చేసే సమయంలో విద్యుత్ వైరు తగలడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులు, స్నేహితులు విషాదంలో మునిగిపోయారు. జనసేన కార్యకర్తల్లోనూ విషాదం నెలకొంది.