హైద్రాబాద్ లో రూ.10 వేల లంచం తీసుకుంటూ టోలిచౌకి ఎస్సై అరెస్ట్

రూ.10 వేల లంచం తీసుకుంటూ టోలిచౌకి ఎస్సై ఆర్. పాండు ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సిటీ రేంజ్–1 ఏసీబీ అధికారులు వలపన్ని అతడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేయకుండా, పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు లంచం డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లి ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.