రేవంత్‌పై ముందు చర్యలు తీసుకోండి: కొండా సురేఖ

తనను రాజీనామా చేయాలని అధిష్ఠానం కోరలేదన్న మంత్రి హైదరాబాద్: తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే ముందు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కోరారు. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేసి చర్యలు తీసుకోవడం సరికాదని సురేఖ అన్నారు. మహిళలు స్వతంత్రంగా జీవించాలని రాహుల్ గాంధీ చెబుతుంటారని గుర్తుచేశారు. తన కుమార్తెను తీవ్రంగా రెచ్చగొట్టడం వల్లే ఆమె ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. పార్టీలో బీసీ నేతలకు ఒక న్యాయం, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు మరో న్యాయమా అని ఆమె...