ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. ఇదే చంద్రబాబు విజన్

అనకాపల్లి: పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడంపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుచూపు, దార్శనికతతోనే దశాబ్దాల కల సాకారమైందని అన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2026 నాటికి లెఫ్ట్ మెయిన్ కెనాల్‌ను పూర్తి చేస్తామని ఇచ్చిన హామీ మేరకు పనులు పూర్తిచేశామని మంత్రి తెలిపారు. ఐదు ప్రధాన నదులు, తొమ్మిది జాతీయ రహదారులను దాటుతూ క్లిష్టమైన పనులను పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లెఫ్ట్ మెయిన్ కెనాల్ పనులు ముందుకు సాగలేదని నిమ్మల ఆరోపించారు. పోలవరం పూర్తయి ఉంటే గోదావరి వరద...