వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన ప్రజా రంజకం.. సంక్షేమానికి పెద్దపీట: పొంగులేటి
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రభుత్వ పనితీరును వివరించారు. ఆర్థిక ఇబ్బందులు, గత ప్రభుత్వ అప్పుల భారం ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా పాలన సాగిస్తున్నామని తెలిపారు. సామాన్య ప్రజల సమస్యలను పరిష్కరించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పొంగులేటి పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి ఇప్పటివరకు రూ.1.76 లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. వరి సాగును ప్రోత్సహించేందుకు క్వింటాల్కు రూ.500 బోనస్ అందిస్తున్నామని, దీంతో తెలంగాణ వరి ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానానికి చేరిందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన అప్పులు, బకాయిలను కూడా తమ...