రోహిత్ అనుభవం.. కోహ్లీ దూకుడు: 2027 వరల్డ్ కప్‌లో భారత్‌కు ఇదే బలం!

న్యూఢిల్లీ: 2027 వన్డే ప్రపంచకప్‌కు టీమిండియా సిద్ధమవుతున్న వేళ.. సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌ వంటి ఒత్తిడితో కూడిన టోర్నీల్లో రోహిత్ అనుభవం భారత జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డాడు. ప్రతిభ, గణాంకాలతో పాటు మానసిక బలం కూడా ప్రపంచకప్ విజయానికి చాలా ముఖ్యమని రోడ్స్ పేర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రోహిత్ అనుభవం యువ ఆటగాళ్లకు మార్గదర్శకంగా ఉంటుందని చెప్పాడు. ఇక విరాట్ కోహ్లీ గెలుపు తపనను రోడ్స్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. గతంలో ప్రపంచక్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా జట్టులో కనిపించిన దూకుడు, గెలవాలనే...