తిలక్ వర్మ కెప్టెన్ ఇన్నింగ్స్.. దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్!
చెన్నై: దులీప్ ట్రోఫీ 2026/27లో సౌత్ జోన్ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది. నార్త్ జోన్తో జరిగిన సెమీఫైనల్లో సౌత్ జోన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ తిలక్ వర్మ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలుపు దిశగా నడిపించాడు. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ జోన్కు తిలక్ వర్మ (51 నాటౌట్) అండగా నిలిచాడు. నారాయణ్ జగదీశన్ 43 పరుగులు చేయగా, రవిచంద్రన్ స్మరణ్తో కలిసి తిలక్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. అంతకుముందు బంతితో ఎండీ నిధీశ్ సత్తా చాటాడు. నార్త్ జోన్ రెండో ఇన్నింగ్స్లో 5/56తో ఐదు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా...