విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రేపు కృష్ణాష్టమి సెలవు

కృష్ణాష్టమి పండుగను పురస్కరించుకుని సెప్టెంబర్ 4న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు సెలవు లభించనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఈ రోజు మూతపడనున్నాయి. విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సాధారణ సెలవు వర్తించనుంది. అయితే ప్రైవేట్ కంపెనీలు, కార్యాలయాల విషయంలో ఆయా సంస్థల నిర్ణయం ప్రకారం పని కొనసాగవచ్చు. పండుగ నేపథ్యంలో విద్యార్థులు, కుటుంబాలు కృష్ణాష్టమి వేడుకలకు సిద్ధమవుతున్నారు.