టెట్ పాస్ కాకుండానే టీచర్గా నియామకం.. అసలేం జరిగింది?
ఆంధ్రప్రదేశ్లో టెట్ అర్హత లేకుండానే ఓ వ్యక్తి ఉపాధ్యాయ ఉద్యోగం పొందిన వ్యవహారం కర్నూలు జిల్లాలో వెలుగులోకి వచ్చింది. క్రీడా కోటా ద్వారా ప్రభాకర్ అనే వ్యక్తి ఎస్జీటీగా నియమితులైనట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై ఫిర్యాదులు రావడంతో కర్నూలు డీఈఓ సుధాకర్ విచారణ చేపట్టారు. సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో ఈ అంశాన్ని అధికారులు గుర్తించలేకపోయినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభాకర్ కౌతాళం మండలం వల్లూరు ఎలిమెంటరీ స్కూల్లో విధులు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వ్యవహారంపై మరింత పరిశీలన అనంతరం ప్రభాకర్పై చర్యలు తీసుకోవాలని అధికారులు సిఫార్సు చేశారు. టెట్ అర్హత, నియామక ప్రక్రియలో సర్టిఫికెట్ల పరిశీలనపై ఈ ఘటన మరోసారి చర్చకు దారితీసింది.