నేడు కేబినెట్ భేటీ
అమరావతిలో గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో రాజధాని అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. శాఖమూరులో సెంట్రల్ లైబ్రరీ, ఆడిటోరియం నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. అలాగే రాజధాని పరిధిలోని 29 గ్రామాల అభివృద్ధికి రూ.533 కోట్ల నిధులు కేటాయించే అంశం కూడా కేబినెట్ ముందుకు రానుంది. సంజీవని ప్రాజెక్టుపైనా మంత్రివర్గం చర్చించనుంది.