కొండా సురేఖ సంచలన ఆరోపణలు.. ‘నన్ను తొలగించకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తానన్నారు’!

హైదరాబాద్: తనను మంత్రివర్గం నుంచి తొలగించడంపై మాజీ మంత్రి కొండా సురేఖ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనను పదవి నుంచి తొలగించకపోతే తాను తప్పుకుంటానంటూ కాంగ్రెస్‌ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారని ఆమె ఆరోపించారు. అధికారిక ప్రకటన రాకముందే తన బర్తరఫ్‌ విషయాన్ని సురేఖ ధ్రువీకరించారు. తనను తొలగించే ముందు ప్రభుత్వం గానీ, పార్టీ అధిష్ఠానం గానీ సంప్రదించలేదని సురేఖ తెలిపారు. కనీసం తన వివరణ తీసుకోలేదని, రాజీనామా చేయాలని కూడా ఎవరూ కోరలేదన్నారు. తనతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్న తర్వాత నిర్ణయం తీసుకోవాల్సిందని ఆమె అభిప్రాయపడ్డారు. నలుగురు నేతలపై ఆరోపణలు తనపై వేం నరేందర్‌రెడ్డి, తిరుపతి రెడ్డి, కొండల్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి కలిసి కుట్ర...