కొండా సురేఖను బర్తరఫ్ చేయాలంటూ గవర్నర్కు సీఎం లేఖ
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్లో కొంతకాలంగా కొనసాగుతున్న అంతర్గత వివాదాలకు అధిష్ఠానం ముగింపు పలికింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదం తెలిపింది. దీంతో సురేఖను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు సిఫారసు లేఖ పంపించారు. సురేఖ స్వచ్ఛందంగా రాజీనామా చేసేందుకు అంగీకరించకపోవడంతోనే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆమె కుమార్తె సీఎం రేవంత్రెడ్డిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో మొదలైన వ్యవహారం.. పార్టీ క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లింది. అనంతరం అధిష్ఠానం చర్చించి సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. చిన్నారెడ్డిపై కూడా వేటు...