వైసీపీలో కీలక మార్పులకు జగన్ ఆలోచన?

వైసీపీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక మార్పులపై ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జగన్ చుట్టూ ఉన్న కోటరీపై కొంతకాలంగా పార్టీలోని పలువురు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారశైలిపై పార్టీలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర సమన్వయ బాధ్యతలను సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావుకు అప్పగించే అంశాన్ని జగన్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే సజ్జల రామకృష్ణారెడ్డికి ఇతర పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఈ మార్పులపై వైసీపీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.