గుండె , ఊపిరితిత్తుల వైఫల్యంలో ఎకమో కీలక ప్రాణాధార చికిత్స
ఖమ్మంలో యశోద మెడికల్ సెంటర్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఖమ్మం ప్రతినిధి: సెప్టెంబర్, 3: ఖమ్మం : తీవ్రమైన గుండె లేదా ఊపిరితిత్తుల వైఫల్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఎకమో) ఒక కీలకమైన అధునాతన ప్రాణాధార చికిత్సగా ఉపయోగపడుతుందని యశోద హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు . ఖమ్మంలోని యశోద మెడికల్ సెంటర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్ డి. మధు కిరణ్ , డాక్టర్ వినీత్ ఇలాపురం , డాక్టర్ బి. అభిషేక్ మాట్లాడుతూ హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద హాస్పిటల్స్లో అత్యాధునిక వైద్య మౌలిక సదుపాయాలు , అనుభవజ్ఞులైన నిపుణుల బృందం మరియు అధునాతన చికిత్సా విధానాలతో ఎకమో సేవలు...