గ్రామాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం… రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రివర్యులు
గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఖమ్మం ప్రతినిధి: సెప్టెంబర్, 3: గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రజాప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం మంత్రి, కూసుమంచి మండలం కేశవాపురం గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత రెండున్నర ఏళ్లలో కేశవాపురం గ్రామానికి రూ. 4 కోట్ల నిధులు మంజూరు చేసి, అభివృద్ధి పనులు చేశామన్నారు. ఇందులో రూ. 40 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, రూ....