ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుంచి క్రేజీ అప్డేట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటులు షాహిద్ కపూర్, అలియా భట్ కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరో రెండు వారాల్లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని నిర్మాత రవిశంకర్ తెలిపారు. 2027 ఫిబ్రవరి నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ముందుగా ప్రకటించిన ప్రకారం 2027 జూన్ 11న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు.