2027 వరకు ఎల్‌నినో.. భారత్‌కు వాతావరణ ముప్పు

ఎల్‌నినో ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగేందుకు 100 శాతం అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజా అంచనాలో వెల్లడించింది. ఈ ఏడాది చివరి నాటికి ఎల్‌నినో తీవ్ర స్థాయికి చేరే అవకాశం ఉందని హెచ్చరించింది. పసిఫిక్‌ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే భారీగా పెరిగినట్లు డబ్ల్యూఎంఓ తెలిపింది. దీంతో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు, కరవు, వర్షపాతంలో మార్పులు, కొన్ని చోట్ల భారీ వర్షాల ముప్పు పెరగొచ్చని పేర్కొంది. ఎల్‌నినో ప్రభావం భారత్‌పైనా పడే అవకాశం ఉంది. సాధారణంగా ఎల్‌నినో బలపడినప్పుడు నైరుతి రుతుపవనాలు బలహీనపడే పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పటికే దేశంలో 16 శాతం వర్షపాతం లోటు...