దురదను వ్యాపారంగా మార్చాడు.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
చైనాకు చెందిన 32 ఏళ్ల జాంగ్ జియాఖియావో వినూత్న ఆలోచనతో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాడు. దురదగా ఉన్నప్పుడు ఇతరులతో శరీరాన్ని గోకించుకునే సేవను ప్రత్యేక వ్యాపారంగా మార్చి ఆదాయం పొందుతున్నాడు. షెంజెన్లో ప్రారంభించిన ఈ సేవకు కస్టమర్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఒక గంట సేవకు 300 యువాన్లు.. అంటే సుమారు రూ.4,200 వసూలు చేస్తున్నాడు. ప్రస్తుతం రెండు స్టోర్ల ద్వారా నెలకు దాదాపు రూ.14 లక్షల వరకు ఆదాయం వస్తున్నట్లు తెలుస్తోంది. కస్టమర్లు సౌకర్యవంతమైన పడకలపై విశ్రాంతి తీసుకుంటుండగా, శిక్షణ పొందిన సిబ్బంది ప్రత్యేక పరికరాలతో వారు కోరిన ప్రాంతంలో గోకుతారు. ఈ అనుభవం ఒత్తిడిని తగ్గించి రిలాక్సేషన్ ఇస్తుందని పలువురు కస్టమర్లు...