ఈ ఏడాదే గగన్యాన్ తొలి ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన
భారత్ ప్రతిష్ఠాత్మక గగన్యాన్ మిషన్లో కీలక ఘట్టానికి ఇస్రో సిద్ధమవుతోంది. తొలి మానవ రహిత ప్రయోగాన్ని ఈ ఏడాది చివరి నాటికి చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ తెలిపారు. తొలి ప్రయోగంలో ‘వ్యోమమిత్ర’ హాఫ్-హ్యూమనాయిడ్ రోబోను అంతరిక్షంలోకి పంపనున్నారు. వ్యోమగాములు వెళ్లే సమయంలో క్యాబిన్లోని పరిస్థితులను ఈ రోబో అనుకరించనుంది. మానవసహిత ప్రయోగానికి ముందు మొత్తం మూడు మానవ రహిత ప్రయోగాలు నిర్వహించి భద్రతా ప్రమాణాలను పరీక్షించనున్నారు. గగన్యాన్కు అవసరమైన కీలక సాంకేతిక పనులు దాదాపు పూర్తయ్యాయి. హెచ్ఎల్వీఎం-3 హ్యూమన్ రేటింగ్, క్రూ ఎస్కేప్, లైఫ్ సపోర్ట్ వ్యవస్థల అభివృద్ధి పూర్తయినట్లు ఇస్రో తెలిపింది. ఇప్పటివరకు సుమారు 8,000 పరీక్షలు నిర్వహించారు....