సంగారెడ్డిలో విద్యార్థినిపై దాడి.. చేతులు కట్టి ఫోన్‌తో బెదిరింపులు

సంగారెడ్డిలో 19 ఏళ్ల డిగ్రీ విద్యార్థినిపై ఇద్దరు యువకులు దాడి చేయడం కలకలం రేపింది. మాస్కులు ధరించి కళాశాలలోకి వచ్చిన నిందితులు విద్యార్థినిని వెంబడించి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ఆమె చేతులను చున్నీతో కట్టి, నోట్లో రుమాలు కుక్కి ఫోన్‌ను తీసుకున్నారు. ఆ ఫోన్‌ నుంచే కుటుంబ సభ్యులకు ఫొటోలు, వీడియోలు పంపి అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.