ఆరు గ్యారంటీలు గాలికి.. 420 హామీలు బోగస్
కాంగ్రెస్ 1000 రోజుల పాలన దగా.. చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో దద్దరిల్లిన బీఆర్ఎస్ నిరసనలు కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మోసపోయాం – ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన రేవంత్ సర్కార్ _కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ సూర్యాపేట సెప్టెంబర్ 04 (ఆర్యాద్వి): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని, మోసపూరిత హామీలతో ప్రజలను నిలువునా వంచించిందని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన...