చనిపోయిన వారి ఐడీ కార్డులు ఏం చేయాలి?

కుటుంబంలో ఎవరైనా మరణించిన తర్వాత వారి ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్ వంటి ముఖ్యమైన పత్రాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఆధార్‌ను నేరుగా రద్దు చేసే విధానం లేకపోయినా, మరణ ధృవీకరణ పత్రంతో సంబంధిత వివరాలను అప్‌డేట్ చేయవచ్చు. ఆధార్ దుర్వినియోగం కాకుండా బయోమెట్రిక్ వివరాలను లాక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. పాన్ కార్డును మాత్రం మరణించిన వ్యక్తికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఖాతాల పనులు పూర్తయిన తర్వాత ఆదాయపు పన్ను శాఖకు సరెండర్ చేయవచ్చు. ఓటర్ ఐడీ విషయంలో మరణ ధృవీకరణ పత్రంతో ఎన్నికల అధికారులను సంప్రదించి పేరు ఓటర్ల జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టాలి. పాస్‌పోర్ట్‌ను భద్రంగా ఉంచుకోవచ్చు. దాని...