ఆరోగ్యం, ఆదాయం రెండింటికీ మేలు.. అవకాడో సాగుతో రైతులకు కొత్త ఆశలు

భారత్‌లో అవకాడో పండ్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఈ పండు రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తోందని తెలిపారు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో దేశంలోని పలువురు అవకాడో రైతుల విజయాలను ప్రధాని ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన వరదరాజ్ గతంలో టమాటా, అరటి సాగు చేసేవారు. అవకాడో సాగుపై ఆసక్తి పెంచుకుని పంట సాగు ప్రారంభించగా ప్రస్తుతం ఏటా సుమారు నాలుగు టన్నుల దిగుబడిని సాధిస్తూ స్థానిక మార్కెట్లకు విక్రయిస్తున్నారు. తమిళనాడులోని కొడైకెనాల్ ప్రాంతంలోనూ రైతులు అవకాడో సాగుతో మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. కర్ణాటకలోని చిక్కమగళూరు రైతులు కాఫీ, మిరియాల తోటల్లో అంతరపంటగా అవకాడోను...