ప్రొటీన్లు ఉన్న ఆహారంతో అలసటకు చెక్‌!

రోజువారీ బిజీ జీవితంలో పని ఒత్తిడి, సరైన విశ్రాంతి లేకపోవడం వల్ల చాలామందిలో అలసట కనిపిస్తోంది. శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా చురుగ్గా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని డైట్‌లో భాగం చేసుకోవడం ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. నట్స్‌తో పోషకాలు బాదం, పిస్తా, అక్రోట్‌ వంటి గింజల్లో ప్రొటీన్లతో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. వీటిని రోజూ పరిమిత మోతాదులో తీసుకోవచ్చు. సలాడ్లు, కూరగాయలతో కలిపి తీసుకున్నా మంచి పోషక విలువలు లభిస్తాయి. అయితే నట్స్‌లో కేలరీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున మితంగా తీసుకోవడం మంచిది. పాలు, పాల పదార్థాలు పాలు, పెరుగు వంటి...