కొండా సురేఖకు తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం: జగదీశ్ రెడ్డి

మంత్రి పదవి నుంచి కొండా సురేఖను తొలగించిన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో ఆమె తదుపరి అడుగుపై చర్చ జరుగుతోంది. ఆమె బీఆర్ఎస్ లేదా బీజేపీలో చేరే అవకాశం ఉందంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. కొండా సురేఖ బీఆర్ఎస్‌లో చేరుతారన్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. ఆమెను తమ పార్టీలోకి తీసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అవసరమైతే తెలంగాణ భవన్ గేటు వరకు కూడా రానివ్వబోమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన నేతలను తిరిగి పార్టీలోకి తీసుకునే విషయంలోనూ జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు....