రేషన్‌ సన్నబియ్యం అమ్మితే కార్డు రద్దు.. మంత్రి తుమ్మల హెచ్చరిక

ప్రభుత్వం పేదలకు అందిస్తున్న సన్నబియ్యాన్ని బయట విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. బియ్యాన్ని అమ్ముతున్నట్లు తేలితే సంబంధిత లబ్ధిదారుల రేషన్‌ కార్డులను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని పూతాని తండాలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి అనంతరం జరిగిన సభలో మాట్లాడారు. పేదల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను దుర్వినియోగం చేయకూడదని సూచించారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను, ప్రజాప్రతినిధులను మంత్రి ఆదేశించారు. ముఖ్యంగా గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఇళ్ల మంజూరులో రాజకీయాలకు తావులేకుండా...