కేరళలో ఘోర ప్రమాదం.. 8 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కైపమంగలం సమీపంలోని పనంబిక్కున్ను వద్ద జాతీయ రహదారి-66పై ఆగి ఉన్న గూడ్స్ లారీని కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు రిజిస్ట్రేషన్కు చెందిన ఈ కారులో యువకులు గురువాయూర్ నుంచి కొడుంగల్లూర్ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రాత్రి సుమారు 11.40 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. లారీని ఢీకొట్టిన సమయంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమై లారీ కిందకు చొచ్చుకుపోయింది. దీంతో అందులో ఉన్నవారు తీవ్రంగా చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక...