బుద్గాంలో భద్రతా బలగాల ఎన్‌కౌంటర్.. లష్కరే కమాండర్ మృతి

జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు కొనసాగుతున్నాయి. బుద్గాం జిల్లాలోని యూస్‌మార్గ్ అటవీ ప్రాంతంలో శనివారం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా కమాండర్ యాసిర్ హతమయ్యాడు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో స్పెషల్ ఫోర్సెస్, 53 రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. బలగాల రాకను గుర్తించిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో యాసిర్ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. యాసిర్ గతంలో లష్కరే తోయిబాలోని సులేమాన్ మూసా గ్రూప్‌లో సభ్యుడిగా ఉన్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. కొంతకాలంగా యూస్‌మార్గ్ పరిసరాల్లో...