ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్.. రోజుకు వందల యూనిట్లే తయారీ!

అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ కొత్త మోడల్ తయారీలో కంపెనీ అనుసరిస్తున్న కఠినమైన నాణ్యత ప్రమాణాల కారణంగా ప్రారంభ దశలో ఉత్పత్తి వేగం చాలా తక్కువగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రోజుకు కొన్ని వందల ఫోన్లు మాత్రమే తయారవుతున్నట్లు టెక్ వర్గాలు చెబుతున్నాయి. విడిభాగాల కొరత కంటే.. ఫోన్ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదన్న ఆపిల్ నిర్ణయమే ఉత్పత్తి మందగించడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఫోల్డబుల్ ఐఫోన్‌కు సాంకేతిక సవాళ్లు కొత్త ఫోల్డబుల్ ఐఫోన్ తయారీలో ఆపిల్‌కు పలు సాంకేతిక సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకమైన డిస్‌ప్లే, కొత్త...