గుండె లయలో మార్పులను నిర్లక్ష్యం చేయొద్దు.. ముందస్తు గుర్తింపుతో మెరుగైన చికిత్స
గుండె కొట్టుకునే విధానంలో మార్పులు కనిపించినప్పుడు చాలామంది వాటిని ఒత్తిడి, అలసట లేదా జీవనశైలికి సంబంధించిన సమస్యలుగా భావిస్తుంటారు. అయితే గుండె వేగం ఎక్కువగా లేదా తక్కువగా ఉండటం, క్రమరహితంగా కొట్టుకోవడం, గుండెలో దడ వంటి లక్షణాలు అరిథ్మియాకు సంకేతాలు కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొత్తగా కనిపించే లేదా తరచూ ఇబ్బంది పెట్టే లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం ముఖ్యమని సూచిస్తున్నారు. అరిథ్మియా అంటే ఏమిటి? గుండె విద్యుత్ వ్యవస్థలో లోపం ఏర్పడినప్పుడు అరిథ్మియా సంభవిస్తుంది. ఈ పరిస్థితిలో గుండె సాధారణం కంటే వేగంగా, నెమ్మదిగా లేదా క్రమం తప్పిన విధంగా కొట్టుకోవచ్చు. కొందరిలో గుండె దడ, ఆయాసం, అలసట, తల తిరగడం...